Chiranjeevi: జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిరంజీవి

Chiranjeevi pays tributes to Jayaprakash Reddy

  • జయప్రకాశ్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు
  • ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ను సృష్టించుకున్నారు
  • నాటకరంగంపై ఆయనకు ఎంతో ప్రేమ

ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు. ఆయనతో కలిసి తాను చివరిసారిగా 'ఖైదీ నెంబర్ 150'లో నటించానని తెలిపారు. గొప్ప నటుడని కితాబిచ్చారు. తన కన్నతల్లి నాటరంగం, తనను పెంచిన తల్లి సినీరంగం అని జయప్రకాశ్ రెడ్డి అంటుండేవారని చెప్పారు. నాటకరంగంపై ఆయనకు ఎంతో ప్రేమ అని అన్నారు.

'శని, ఆదివారాల్లో షూటింగులు పెట్టుకోనండి... స్టేజ్ మీద పర్ఫామెన్స్ ఇస్తుంటాను... మీరు ఎప్పుడైనా రావాలి' అని తనను అడిగేవారని చిరంజీవి చెప్పారు. అయితే ఆయన స్టేజ్ ఫర్ఫామెన్స్ ను చూసే అవకాశాన్ని తాను పొందలేకపోయానని తెలిపారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్ర అనగానే మొదట గుర్తుకొచ్చేది జయప్రకాశ్ రెడ్డి అని అన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ను సృష్టించుకున్నారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News