Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Sai Pallavi joins Love story shoot

  • హైదరాబాదులో 'లవ్ స్టోరీ' మొదలు 
  • నిఖిల్ కొత్త సినిమాకి భారీ బడ్జెట్టు
  • బెల్లంకొండతో మారుతి తదుపరి చిత్రం

*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ కేవలం 15 మంది యూనిట్ సభ్యులతో చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నామనీ, షూటింగుకి ముందు అందరికీ కరోనా టెస్టులు నిర్వహించామనీ నిర్మాతలు తెలిపారు.
*  యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని 'కార్తికేయ' ఫేం చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగును కేరళలోని అడవుల్లో నిర్వహించనున్నారు. ఇక ఇందులో వీఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో, వీటి కోసం 10 కోట్ల బడ్జెట్టును కేటాయించినట్టు తెలుస్తోంది.
*  ఆమధ్య సాయితేజ్ తో 'ప్రతి రోజు పండగే' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తాడనీ, ఇది పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని అంటున్నారు.      

Sai Pallavi
Naga Chaitanya
Shekhar Kammula
Nikhil
  • Loading...

More Telugu News