Donald Trump: ట్రంప్ మాత్రమే అమెరికాను రక్షించగలరు: ప్రశంసలు కురిపించిన బిన్‌లాడెన్ బంధువు

Only Trump Can Save America From Another terror Attack

  • అమెరికా నా రెండో ఇల్లు
  • జో బైడెన్ ఎన్నికైతే మళ్లీ ఉగ్రదాడి
  • ఉగ్రవాదాన్ని ట్రంప్ సహించరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బిన్‌లాడెన్ బంధువు నూర్ బిన్ లాడెన్ ప్రశంసలు కురిపించారు. రానున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికైతే అమెరికాపై మరోమారు 9/11 లాంటి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అమెరికాను ట్రంప్ మాత్రమే రక్షించగలరని ప్రశంసించారు. నూర్‌బిన్ లాడెన్ మరెవరో కాదు, బిన్ లాడెన్ సవతి సోదరి కుమార్తె. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు. చిన్నప్పుడు తాను అమెరికాలో పర్యటించానని, ఆ దేశాన్ని తన రెండో ఇల్లుగా భావిస్తానని పేర్కొన్నారు. తన 14వ ఏట తన అంకుల్ (బిన్ లాడెన్) అమెరికాపై దారుణమైన ఉగ్రదాడికి పాల్పడ్డాడని, ఆ దాడి తనను తీవ్ర వేదనకు గురిచేసిందని అన్నారు.

బరాక్ ఒబామా, జో బైడెన్‌లు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడే ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) విస్తరించిందని పేర్కొన్న నూర్.. ట్రంప్ మాత్రం ఇలాంటి వాటిని ఆదిలోనే మట్టుపెడతారని ప్రశంసించింది. ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నానని, రానున్న ఎన్నికల్లో ఆయనకే తన మద్దతని నూర్ బిన్ లాడెన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News