Deepak Kochchar: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్తను అరెస్ట్ చేసిన ఈడీ
- మనీలాండరింగ్ అభియోగాలపై దీపక్ కొచ్చర్ అరెస్ట్
- గతేడాది క్రిమినల్ కేసు నమోదు
- రుణ మంజూరు అంశంలో అవకతవకల గుర్తింపు
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు, వీడియో కాన్ గ్రూప్ మధ్య జరిగిన లావాదేవీల్లో మనీ లాండరింగ్ చోటుచేసుకుందన్న అభియోగాలపై దీపక్ కొచ్చర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీపక్ ను గత రాత్రి అరెస్ట్ చేసిన అధికారులు నేటి మధ్యాహ్నం నుంచి ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో దర్యాప్తు బృందం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద గతేడాది ఆరంభంలో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వీడియో కాన్ గ్రూప్ కు చెందిన వేణుగోపాల్ ధూత్ లపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.1,875 కోట్ల రుణ మంజూరు అంశంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు.