sriti hassan: అలాంటి జీవితాన్ని నేను కొన‌సాగించలేను: హీరోయిన్ శ్రుతిహాసన్

sriti about her career

  • మరొకరి అంచనాలకు తగినట్లుగా ఉండ‌ను
  • ఎవరి సలహాలూ తీసుకోను
  • ఆత్మసాక్షి ప్ర‌కార‌మే నడచుకుంటాను
  • నా‌ మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటా

మరొకరి అంచనాలు, ఇష్టాల‌కు తగినట్లుగా త‌న‌ జీవితాన్ని కొన‌సాగించలేనని, త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు జీవితాన్ని గ‌డుపుతాన‌ని హీరోయిన్ శ్రుతి హాస‌న్ చెప్పింది. తాజాగా, ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ...త‌న కెరీర్‌ విషయంలో ఎవరి సలహాలు తీసుకోనని చెప్పింది. త‌న  ఆత్మసాక్షి ప్ర‌కార‌మే నడచుకుంటాన‌ని తెలిపింది. త‌న‌ మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటానని చెప్పింది.

ముంబయిలో పరిస్థితులు విచిత్రంగా ఉంటాయని, ఒక‌వేళ ఏడాది పాటు ఖాళీగా ఉంటే కెరీర్‌ ముగిసిపోయిందని అనుకుంటార‌ని చెప్పింది. న‌టులు అంకితభావంతో పనిచేయడం లేదని విమర్శలు చేస్తారని తెలిపింది. తాను ప‌లు భాషల్లో సినిమాలు చేస్తున్నానని, బాలీవుడ్‌ అందులో ఒకటి మాత్రమేన‌ని చెప్పింది. తాను దక్షిణాది అమ్మాయినైనందుకు గర్విస్తానని తెలిపింది. త‌న‌కు తమిళం, తెలుగు రెండు కళ్లతో సమానమ‌ని తెలిపింది.

sriti hassan
Bollywood
Tollywood
  • Loading...

More Telugu News