Devineni Uma: మీ పంతం వెనక మతలబు ఇదేనా?: దేవినేని ఉమ‌

devineni slams jagan

  • మీటర్ కాలితే రైతుజేబుకు చిల్లేనా?
  • చోరీకి గురైనా రైతే భరించాలా?
  • ఉచిత విద్యుత్ ను నీరుగార్చేందుకే నగదు బదిలీనా?  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు రానున్న విష‌యం తెలిసిందే. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా ప్రభుత్వమే రైతుల బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేసేలా ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ఈ తీరు రైతుల‌కు భారం అవుతుంద‌ని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆరోపించారు. ఉచిత విద్యుత్ ను నీరుగార్చేందుకే నగదు బదిలీ చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.    

"మీటర్ కాలితే రైతుజేబుకు చిల్లేనా? చోరీకి గురైనా రైతే భరించాలా? ఉచిత విద్యుత్ ను నీరుగార్చేందుకే నగదు బదిలీనా? కొన్ని యూనిట్లకే పరిమితం చేసి రైతులపై భారం మోపుతారా? రైతులు వ్యతిరేకిస్తున్నా ఎలాగైనా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న పంతం వెనక మతలబు ఇదేనా? చెప్పండి వైఎస్ జ‌గ‌న్" అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఈనాడులో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆయ‌న‌ పోస్ట్ చేశారు.

Devineni Uma
Telugudesam
Jagan
  • Loading...

More Telugu News