Hyderabad: భార్యను వేధిస్తున్న సినీ రచయిత‌పై కేసు నమోదు

Case filed against movie writer

  • గత కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్న యర్రంశెట్టి
  • కేసు వెనక్కి తీసుకోకుంటే నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానని బెదిరింపులు
  • ఆమె స్నేహితుల వద్ద అసభ్యకర వ్యాఖ్యలు
  • ఆమె  సోదరి పోలీసులకు ఫిర్యాదు

సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది.  పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే యర్రంశెట్టి రమణ ‌గౌతమ్ అదే ప్రాంతానికి చెందిన యువతి (24)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపడంతో గతేడాది జూన్‌లో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తిరిగి కలిసి ఉండేందుకు అంగీకరించారు.

అయితే, గత కొంతకాలంగా రమణ గౌతమ్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు ఫోన్లు చేసి బెదిరించడం మొదలు పెట్టాడని  యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానని, సినీ పరిశ్రమలో ఉన్న తన స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Banjarahills
Movie writer
yerramsetti ramana goutham
Crime News
  • Loading...

More Telugu News