IPL 2020: ఐపీఎల్ 13 సీజన్ షెడ్యూల్ విడుదల... ఆరంభ మ్యాచ్ లో తలపడనున్న ముంబయి, సీఎస్కే

IPL lastest season schedule released

  • సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్
  • నవంబరు 10న ముగియనున్న టోర్నీ
  • కరోనా వ్యాప్తి కారణంగా యూఏఈ తరలివెళ్లిన ఐపీఎల్

కరోనా పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ వేదికగా జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ షెడ్యూల్ ను ఐపీఎల్ పాలకమండలి నేడు విడుదల చేసింది. సెప్టెంబరు 19న టోర్నీ ఆరంభం అవుతుంది. నవంబరు 10న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది.

టోర్నీ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు అబుదాబి ఆతిథ్యమివ్వనుంది. తదుపరి లీగ్ మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (సెప్టెంబరు 20), రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ (సెప్టెంబరు 21) ఆడతాయి. ప్రస్తుతానికి లీగ్ పోటీల షెడ్యూల్ మాత్రమే వెల్లడించారు. ప్లే ఆఫ్ పోటీల వేదికలు త్వరలో ప్రకటిస్తారు.

IPL 2020
Schedule
UAE
India
Corona Virus
  • Loading...

More Telugu News