Bigg Boss Telugu 4: నేటి నుంచి బిగ్‌బాస్-4 సీజన్ ప్రారంభం.. లీకైన కంటెస్టెంట్ల వివరాలు!

Bigg Boss telugu 4 participants list leaked

  • బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న నాగార్జున
  • 15 మంది కంటెస్టెంట్ల పేర్లు బయటకు
  • నటి సురేఖ వాణి పేరు కూడా చక్కర్లు

బుల్లితెర ప్రేక్షకులకు నేటి నుంచి వినోదమే వినోదం. స్టార్ మా చానల్‌లో నేటి నుంచి బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో షో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.

లీకైన జాబితా ప్రకారం.. దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌), దేవి నాగవల్లి (యాంకర్‌), గంగవ్వ (యూట్యూబ్‌ స్టార్‌), ముక్కు అవినాష్‌ (జబర్దస్త్ ఫేం), మోనాల్‌ గుజ్జార్‌ (హీరోయిన్‌), అమ్మ రాజశేఖర్‌( సినీ నృత్యదర్శకుడు), కరాటే కళ్యాణి (నటి), నోయల్‌(సింగర్‌), సూర్యకిరణ్‌ (సినీ దర్శకుడు), లాస్య (యాంకర్‌), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేం), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు), అరియానా గ్లోరీ (యాంకర్‌, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), అభిజిత్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ సినిమా హీరో) ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు సినీ నటి సురేఖ వాణి, మెహబూబా దిల్‌ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 4
Star Maa
Nagarjuna
Participants
  • Loading...

More Telugu News