Rajamouli: రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి ఇంట్లో 'వి' చిత్రాన్ని వీక్షించిన వైనం!

  • ఇంట్లో అంద‌రూ టీవీ ముందు కూర్చున్న తీరు 
  • 'వి' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూసిన కుటుంబం
  • ఫొటోను పోస్ట్ చేసిన కార్తికేయ 
rajamouli famili watches v movie

కుటుంబం అంతా క‌లిసి ఒకే చోట కూర్చొని టీవీలు, సినిమాలు చూసే రోజులు క‌న‌మ‌రుగవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లతో ఇంట్లోని అంద‌రూ ఎవరికి వారు బిజీగా ఉంటున్నారు. త‌మ‌కు న‌చ్చిన సినిమాల‌ను వాటిల్లోనే ఒంట‌రిగా చూస్తూ కాల‌క్షేపం చేస్తున్నారు.

అయితే, రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులు మాత్రం అంద‌రూ ఒకే చోట కూర్చొని సినిమా చూశారు. నాని న‌టించిన 'వి' సినిమా ఈ రోజు ఓటీటీ ప్లేయర్ ద్వారా విడుదలైన విష‌యం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో ఆ సినిమాను రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులంతా క‌లిసి చూశారు. ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వారు ఇలా ఇంట్లోనే ఓ గ‌దిలో కూర్చొని సినిమా చూశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కార్తికేయ పోస్ట్ చేసి, థియేట‌ర్ల‌లో 'వి' సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో హంగామాను మిస్ అవుతున్నామ‌ని చెప్పాడు. అయితే, ఇంట్లో అంద‌రం కూర్చొని చూడ‌డం కూడా బాగుంద‌న్నాడు.

More Telugu News