China: దారితప్పిన ముగ్గురు చైనీయులను రక్షించిన భారత సైనికులు

Indian soldiers saves 3 chinese

  • సిక్కిం బోర్డర్ దాటిన చైనీయులు
  • దారితప్పి పొరపాటున భారత్ లో ప్రవేశం
  • ఆహారం, దుస్తులు అందించిన భారత సైన్యం

చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులను భారత బలగాలు రక్షించాయి. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం వివరాల్లోకి వెళ్తే, ఉత్తర సిక్కిం ప్రాంతంలో సముద్ర మట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తైన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న వీరు ముగ్గురు దారి తప్పి భారత భూభాగంలోకి ప్రవేశించారు. అయితే వీరి బాధను అర్థం చేసుకున్న సైనికులు వారిని ఆదరించారు.

ఆహారాన్ని అందించడమే కాకుండా, శీతల వాతావరణం నుంచి రక్షించుకునేందుకు దుస్తులను కూడా ఇచ్చారు. అంతేకాదు, వారికి ఆక్సిజన్ ను కూడా అందించారు. ఈ విషయాన్ని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. అనంతరం వారు తిరిగి వెళ్లడానికి జవాన్లు సహకరించారు. ఈ సందర్భంగా మన సైన్యానికి చైనీయులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి చెందిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించడం గమనార్హం.

China
India
Border
Sikkim
  • Loading...

More Telugu News