Devineni Uma: రైతుల జీవితాలు తాకట్టుపెడతారా.. వైఎస్ జ‌గ‌న్ గారూ?: దేవినేని ఉమ‌

devineni slams jagan

  • పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్ప‌లేదు
  • రైతుకు నగదు బదిలీ చేయాలని చెప్పలేదు
  •  మినిట్స్ కాపీలో మీటర్ల మాటే లేదు
  • మీటర్లు బిగించి తీరుతామంటూ మీరు అంటున్నారు

వైసీపీ స‌ర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. "పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని, రైతుకు నగదు బదిలీ చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు.  మినిట్స్ కాపీలో మీటర్ల మాటే లేదు.  ఉచిత విద్యుత్ పట్ల మీ ప్రభుత్వ వైఖరితో  రైతులు ఆందోళన చెందుతున్నా, మీటర్లు బిగించి తీరుతామంటూ మీరు చేసే అప్పుల కోసం రైతుల జీవితాలు తాకట్టుపెడతారా? అదనపుభారం సంగతేంటి? వైఎస్ జ‌గ‌న్ గారూ?" అని ప్ర‌శ్నించారు.  ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆయన పోస్ట్ చేశారు.

గ‌తంలో  చంద్రబాబు నాయుడు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్’ పెడతామన్నప్పుడు వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ భారీ ఉద్యమమే నడిపిందని అందులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు మాత్రం మళ్లీ విద్యుత్‌ సంస్కరణల పేరిట జగన్‌ సర్కారు పంపుసెట్లకు మీటర్లు పెడుతోంద‌ని, నగదు బదిలీ అమలు చేయాలని నిర్ణయించిందని అందులో పేర్కొన్నారు. విమ‌ర్శ‌లు రావ‌డంతో కేంద్రం చెప్పింది కాబ‌ట్టి తాము చేస్తున్నామ‌ని వైసీపీ స‌ర్కారు అంటోంద‌ని అందులో తెలిపారు.

Devineni Uma
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News