Bharat Biotech: రెండో దశ క్లినికల్ పరీక్షల్లో భారత్ బయోటెక్ కరోనా టీకా!

Bharat Biotech gets permission for second trials for corona virus

  • కోవాక్జిన్ పేరుతో వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్
  • ఇప్పటికే తొలిదశ ట్రయల్స్ పూర్తి
  • రెండో దశ ట్రయల్స్ కు అనుమతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కునేందుకు పలు చోట్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. మన దేశంలో సైతం పలు సంస్థలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కు కూడా అనుమతులు అభించాయి. వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే తొలిదశ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం నుంచి రెందో దశ ట్రయల్స్ ప్రాంరంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుంది. 'కోవాక్జిన్' పేరుతో భారత్ బయోటెక్ వాక్సిన్ ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News