Microsoft: మీ ఫోన్లో యాప్ లు కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమైతే... మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తో ఇది సాధ్యం!

Microsoft new app shift your android apps into pc desktop

  • మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ యువర్ ఫోన్ కంపానియన్
  • ఫోన్ లోని యాప్ లను కంప్యూటర్ డెస్క్ టాప్ పైకి చేర్చే యాప్
  • శాంసంగ్ గెలాక్సీ యూజర్లకే పరిమితం

సాధారణంగా ఫోన్ లో ఉండే అంశాలను స్క్రీన్ మిర్రరింగ్ సాయంతో ఎల్ఈడీ టెలివిజన్ తెరపై చూడడం సాధ్యమే. ఇప్పుడదే తరహాలో ఫోన్ లోని యాప్ లను కంప్యూటర్ తెరపై చూసుకోవచ్చు. ఇది కూడా ఒకరకంగా స్క్రీన్ మిర్రరింగ్ అనే చెప్పాలి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ ఓ కొత్త యాప్ రూపొందించింది. ఈ యాప్ పేరు 'యువర్ ఫోన్ కంపానియన్'.

మీ ఫోన్ లో ఉన్న యాప్ లను ఈ మైక్రోసాఫ్ట్ యాప్ కంప్యూటర్ తెరపైకి చేర్చుతుంది. తద్వారా మీరు ఆయా యాప్ ల సాయంతో చేయాలనుకున్న పనులను కంప్యూటర్ తెరపైనే సులభంగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్ శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ యాప్... విండోస్ 10 ఓఎస్ ఉన్న కంప్యూటర్లపై మాత్రమే పనిచేస్తుంది. ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 9 వెర్షన్, ఆపై వెర్షన్లను కలిగివుండాలి.

  • Loading...

More Telugu News