Jagananna Vidya Kanuka: జగనన్న విద్యా కానుక కార్యక్రమం అక్టోబరు 5కి వాయిదా
- సెప్టెంబరు 5న జరగాల్సిన జగనన్న విద్యా కానుక
- సెప్టెంబరు 30 వరకు స్కూళ్లు తెరవరాదంటూ కేంద్రం మార్గదర్శకాలు
- విద్యా కానుక కార్యక్రమం వాయిదా వేసిన ఏపీ సర్కారు
ఏపీలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా పడింది. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు. అక్టోబరు 5న జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు తెరవరాదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల 5న చేపట్టాల్సిన జగనన్న విద్యా కానుక నెల రోజులు వాయిదా పడింది.