Kanakadurga Flyover: ఈ నెల 18న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం!
![Kanakadurga flyover will be started September eighteenth](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-aacab5397304.jpg)
- నిర్మాణం పూర్తిచేసుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్
- ఇటీవల ప్రారంభోత్సవం వాయిదా
- తాజా ప్రారంభోత్సవం వివరాలను వెల్లడించిన కేశినేని నాని
విజయవాడ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 4న ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల చేతులమీదుగా ఈ భారీ ఫ్లైఓవర్ ఓపెనింగ్ జరుపుకోవాల్సి ఉన్నా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, కనకదుర్గ ఫ్లైఓవర్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని నాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-fbed12f044ec25cbf03c6f6a16a7515b66d8b0f6.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-9f8159f8b78e90b9eeea178337910a7d257666c4.jpg)