Kangana Ranut: ముంబయి వచ్చి తీరుతా... దమ్ముంటే ఆపండి!: కంగనా సవాల్

Kangana Ranaut says that she will come to Mumbai
  • తనను బెదిరిస్తున్నారన్న కంగనా
  • కొట్టి చంపేస్తామంటున్నారని వెల్లడి
  • ఎయిర్ పోర్టులో దిగే టైమ్ కూడా చెబుతానంటూ ట్వీట్
ముంబయి రావొద్దంటూ తనను చాలామంది బెదిరిస్తున్నారని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వెల్లడించారు. కంగనాకు ముంబయిలో ఉండే హక్కులేదని, ముంబయిలో ఆమెను కాలుమోపనివ్వబోమని, ముంబయి వస్తే చచ్చేదాకా కొడతామని హెచ్చరిస్తున్నారని వివరించారు. కానీ తాను ముంబయి రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.

సెప్టెంబరు 9న ముంబయిలో అడుగుపెడుతున్నానని, ముంబయి ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే టైమ్ కూడా చెబుతానని, దమ్మున్నవాళ్లెవరో తనను ఆపుకోవచ్చని సవాల్ విసిరారు. కంగనా రనౌత్... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ బంధుప్రీతి గురించి, డ్రగ్స్ దందా గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. కరణ్ జొహార్ వంటి బడా ఫిలింమేకర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చాయి.
Kangana Ranut
Mumbai
Airport
Sushant Singh Rajput
Bollywood

More Telugu News