Dileep Kumar: ఇద్దరు సోదరులు చనిపోయిన సంగతి ఇంత వరకు బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ కు తెలియదు.. కారణం ఇదే!

Dilip Kumar Doesnt Know Of His Brothers Deaths

  • కరోనాతో చనిపోయిన దిలీప్ కుమార్ ఇద్దరు సోదరులు
  • ప్రస్తుతం దిలీప్ కుమార్ వయసు 97
  • దిలీప్ సాహిబ్ కు ఏ విషయం చెప్పలేదన్న సైరా భాను

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇద్దరు సోదరులు ఇషాన్ ఖాన్ (90), అస్లాం ఖాన్ (88) కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే, ఈ విషయం ఇంత వరకు దిలీప్ కుమార్ కు తెలియదు.

ఈ సందర్భంగా దిలీప్ కుమార్ భార్య సైరా భాను మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే వీరిద్దరూ చనిపోయిన సంగతి దిలీప్ సాహిబ్ కు తెలియదని చెప్పారు. దిలీప్ సాహిబ్ కు బాధ కలిగించే ఏ ఒక్క విషయాన్ని ఆయనకు చెప్పడం లేదని తెలిపారు. అమితాబ్ బచ్చన్ తో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని... అయినా, అమితాబ్ కరోనా బారిన పడిన విషయం కానీ, ఆయన కోలుకున్న విషయం కానీ ఇంత వరకు దిలీప్ సాహిబ్ కు తెలియదని చెప్పారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ వయసు 97 సంవత్సరాలు అనే విషయం గమనార్హం.

దిలీప్ సాహిబ్ పూర్తిగా ఇంటిపట్టునే ఉన్నారని, ఆయన మనసు ప్రశాంతంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సైరా భాను  చెప్పారు. ఆయనకు కొంచెం బీపీ, డీహైడ్రేషన్ ఉన్నాయని... చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.

Dileep Kumar
Bollywood
Brothers
Saira Bhanu
  • Loading...

More Telugu News