Nara Lokesh: దిలీప్ రెడ్డి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: నారా లోకేశ్

There is no law and order in AP says Nara Lokesh
  • రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది
  • శాంతిభద్రతలు క్షీణించాయి
  • దిలీప్ రెడ్డి ఇంటికెళ్లి దాడి చేశారు
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని చెప్పారు. గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం వల్లభాపురంలో దిలీప్ రెడ్డి అనే యువకుడి ఇంటికెళ్లి వైసీపీ శ్రేణులు కర్రలతో దాడి చేశాయని చెప్పారు. అడ్డుకోబోయిన దిలీప్ రెడ్డి తండ్రి, బాబాయ్ లపై కూడా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. గ్రామాల్లో వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దిలీప్ రెడ్డి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Guntur District
Telugudesam
Dileep Reddy
YSRCP

More Telugu News