Kodali Nani: చంద్రబాబు, ఉమలపై ఓ రేంజిలో విరుచుకుపడిన కొడాలి నాని

Kodali Nani fires on Chandrababu and Devineni Uma
  • చంద్రబాబు దళారి అంటూ వ్యాఖ్యలు
  • తమ ముందుకొచ్చి చిటికెలు వేయడం మానుకోవాలని హెచ్చరిక
  • తాను బూతులు తిడితే తట్టుకోలేరంటూ ఆగ్రహం
వైసీపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని, కరోనా నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెట్టుకోవాలని, అంతే తప్ప తమ ముందుకొచ్చి చిటికెలు వేయడం మానుకోవాలని హెచ్చరించారు.

 చంద్రబాబు ఓ దళారి అని, రైతుల నుంచి తక్కువకు కొని హెరిటేజ్ లో అమ్ముకుంటుంటాడని విమర్శించారు. హుద్ హుద్ తుపానుకు ఎదురెళ్లానని చెప్పుకుంటున్న చంద్రబాబు కరోనాను చూసి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాజీమంత్రి దేవినేని ఉమను కూడా వదల్లేదు. తనను బూతుల మంత్రి అనడంపై మండిపడ్డారు. తాను బూతులు తిడితే చంద్రబాబు, దేవినేని ఉమ బతికుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kodali Nani
Chandrababu
Devineni Uma
YSRCP
Telugudesam

More Telugu News