James Bond: జేమ్స్ బాండ్ కొత్త సినిమా 'నో టైమ్ టు డై' ట్రైలర్ విడుదల.. రోమాలు నిక్కబొడుచుకునే ట్రైలర్ మీరూ చూడండి!

Bong movie No Time To Die trailer released

  • నవంబర్లో విడుదలవుతున్న బాండ్ మూవీ
  • బాండ్ పాత్రలో మరోసారి అలరించనున్న డేనియల్
  • 250 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కిన చిత్రం

జేమ్స్ బాండ్ సినిమా అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. బాండ్ సిరీస్ లో వచ్చే తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా 'నో టైమ్ టు డై' సినిమాతో బాండ్ మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు వస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ లో విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

'నో టైమ్ టు డై' సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అద్బుతమైన యాక్షన్ సీన్స్, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు, వెపన్స్, వాహనాలు అన్నీ ట్రైలర్ లో ఉన్నాయి. ట్రైలర్ చూస్తేనే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక సినిమా ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది.

ఈ చిత్రంలో బాండ్ పాత్రను డేనియల్ క్రేగ్ పోషించగా... ఇతర ప్రధాన పాత్రల్లో అనా డీ ఆర్మాస్, రామీ మలేక్, లా సేడోక్స్, నవోమీ హ్యారిస్, బెన్ విషా, జెఫ్రీ రైట్, లాషానా లించ్, క్రిస్టఫ్ వాల్ట్జ్, రాల్ఫ్ ఫిన్నెస్ తదితరులు నటించారు. కేరీ జోజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నవంబర్ 12న యూకేలో, అదే నెల 20న అమెరికాలో ఈ చిత్రం విడుదలవుతోంది. మన దేశంలో కూడా నవంబర్లోనే విడుదలవుతుందని భావిస్తున్నారు. తెలుగు సహా అన్ని భారతీయ భాషల్లోకి దీనిని అనువదిస్తున్నారు. మొత్తం 250 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ... కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News