Alla Ramakrishna Reddy: వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు పితృవియోగం

YSRCP MLA RKs father dead

  • ఆర్కే తండ్రి దశరథరామిరెడ్డి మృతి
  • ఆయన వయసు 87 సంవత్సరాలు
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం

వైసీసీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దశరథరామిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దశరథరామిరెడ్డికి ఇద్దరు కుమారులు. వీరిలో రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే కాగా... ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆర్కే తండ్రి మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.

Alla Ramakrishna Reddy
YSRCP
Father
Dead
  • Loading...

More Telugu News