నయనతార అమ్మవారుగా నటించిన సినిమా.. ఓటీటీ ద్వారా విడుదల!
- ఇద్దరు దర్శకులు కలసి దర్శకత్వం
- భక్తి ప్రధానంగా సాగే హాస్యభరిత చిత్రం
- శాకాహారంతో నిష్ఠగా వున్న నయన్
ఇది భక్తి ప్రధానంగా సాగే హాస్యభరిత చిత్రంగా రూపొందింది. ఇందులో నయనతార తొలిసారిగా అమ్మవారి పాత్రను పోషించింది. మరో విశేషం ఏమిటంటే, షూటింగు జరిగినన్నాళ్లూ ఆమె శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ, చాలా నిష్ఠగా గడిపింది. దీనికి ఆర్.జె. బాలాజీ, ఎన్.జె.శరవణన్ కలసి సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
వాస్తవానికి ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావలసివున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కు నిర్మాత ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.