Junior NTR: 'ఈ అస్థిత్వం మీరు, ఈ వ్య‌క్తిత్వం మీరు'.. హరికృష్ణ గురించి జూ.ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్

ntr tweet about his father

  • ధైర్యంతో కొన‌సాగే మా ప్ర‌స్థానానికి  నేతృత్వం మీరు
  • ఆజ‌న్మాంతం త‌ల‌చుకునే అశ్రుక‌ణం మీరే
  • మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటున్నాను 

'ఈ అస్థిత్వం మీరు, ఈ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొన‌సాగే మా ఈ ప్ర‌స్థానానికి  నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌ల‌చుకునే అశ్రుక‌ణం మీరే' అంటూ జూనియర్ నంద‌మూరి తారక రామారావు తన ట్విట్టర్ ఖాతాలో తన తండ్రి హరికృష్ణను ఉద్దేశించి భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు.

హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. మిస్‌ యు నాన్న అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. తన అన్న నందమూరి కల్యాణ్‌రామ్‌తో పాటు తాను తన తండ్రిని స్మరించుకుంటున్నానని చెప్పాడు.

'మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటున్నాను... మిస్‌ యూ నాన్న' అంటూ నందమూరి కల్యాణ్ రామ్ కూడా పేర్కొన్నాడు. కాగా, 2018లో నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై తలకు, ఛాతీ భాగానికి బలమైన గాయాలు కావడంతో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Junior NTR
Tollywood
Twitter
  • Loading...

More Telugu News