Corona Virus: తెలంగాణలో 1,30,589కి చేరిన కరోనా కేసులు

coronavirus cases in telangana

  • గత 24 గంటల్లో కొత్తగా 2,892 కేసులు
  • ఆసుపత్రుల్లో 32,341 మందికి చికిత్స
  • 97,402 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 846

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,892 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,240 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,589కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,341 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 97,402 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 846కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 477 కరోనా కేసులు నమోదయ్యాయి.    
    

  • Loading...

More Telugu News