Chittoor District: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దుర్మరణంపై చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి!

Chandrababu Shocked Over Pawan Fans Die

  • నిన్న కరెంట్ షాక్ తో మృతి
  • ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్
  • మృతుల కుటుంబాలకు సంతాపం

చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలో ముగ్గురు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విద్యుత్ షాక్ తో మరణించారని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా, దాదాపు 25 అడుగుల ఎత్తయిన భారీ ప్లెక్సీని పవన్ జన్మదినం సందర్భంగా అభిమానులు కడుతుంటే ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Chittoor District
Chandrababu
Pawan Kalyan
Fans
  • Loading...

More Telugu News