Ushasri Charan: మోసగాడి వలలో పడకుండా తప్పించుకున్న కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ

Kalyanadurgam MLA Ushasri complains on a cheater

  • కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీకి మోసగాడి నుంచి ఫోన్
  • కోట్ల రూపాయల రుణాలు ఇప్పిస్తానంటూ టోకరా వేసే ప్రయత్నం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఓ మోసగాడి పన్నాగంలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఓ వ్యక్తి మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఇటీవల ఫోన్ చేశాడు. ప్రధానమంత్రి పథకం కింద రుణాలు ఇప్పిస్తానని, రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.3 కోట్ల రుణం ఇస్తారంటూ టోకరా వేసేందుకు ప్రయత్నించాడు.

అయితే అతడి మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో, వెంటనే పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించి, కేంద్ర పథకాలపై ఆరా తీశారు. వారు చెప్పిన వివరాలతో, అదంతా మోసమని గుర్తించి, ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా విచారణ షురూ చేశారు. తెలంగాణలోనూ ఇదే తరహాలో పలువురు ఎంపీలను మోసం చేసిన సంగతి తెలిసిందే.

Ushasri Charan
Cheating
Police
Kalyanadurgam
Anantapur District
YSRCP
  • Loading...

More Telugu News