Rajamouli: ప్లాస్మా ఇవ్వలేకపోయిన దర్శకుడు రాజమౌళి.. కారణం తెలుపుతూ ట్వీట్

  • శరీరంలోని ప్రతిరక్షకాల కోసం పరీక్షలు నిర్వహించారు
  • నా ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉంది
  • ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలి
  • పెద్దన్న, భైరవ మాత్రం ప్లాస్లా దానం చేశారు
Tested for antibodies My igG levels are 8

టాలీవుడ్ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని  ఆయన గతంలోనే ప్రకటించారు. అయితే, ఆయన ప్లాస్మా ఇవ్వలేకపోయారు. ఇందుకు కారణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

'శరీరంలోని ప్రతిరక్షకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, నా ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉంది. ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలి. పెద్దన్న, భైరవ మాత్రం ప్లాస్లా దానం చేశారు' అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి ఫొటోలను పోస్ట్ చేశారు.

More Telugu News