Ramcharan: నెల్లూరులో పర్యటించిన రామ్ చరణ్, శర్వానంద్.. కారణం ఇదే!

Ramcharan and Sarvanand visits Nellore
  • నిర్మాత తండ్రి అంత్యక్రియల కోసం నెల్లూరుకు వెళ్లిన హీరోలు
  • అభిమాన హీరోలను చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్
  • మేడపైకి వచ్చి అభిమానులకు అభివాదం చేసిన స్టార్ హీరోలు
టాలీవుడ్ యువ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు నెల్లూరులో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతలలో ఒకరైన వంశీ కృష్ణా రెడ్డి తండ్రి మరణించడంతో, అంత్యక్రియలలో పాల్గొనడానికి వారు నెల్లూరుకు వచ్చారు. వారి రాకకు సంబంధించిన వార్తతో అభిమానులు వారు ఉన్న ప్రాంతానికి పోటెత్తారు.

దీంతో, ఇంటి బయట వేచి ఉన్న అభిమానుల కోసం హీరోలిద్దరూ మేడపైకి వచ్చి, వారికి అభివాదం చేశారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో కూడా అభిమానుల హడావుడి ఎక్కువగానే  ఉంది. ఫొటోలు, వీడియోలు తీయడంలో ఫ్యాన్స్ మునిగిపోయారు. కానీ, వారిద్దరు మాత్రం కార్యక్రమం ముగిసేంత వరకు మౌనంగా ఉన్నారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Ramcharan
Sarvanand
Nellore
Tollywood

More Telugu News