Priya Prakash Varrier: కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియా ప్రకాశ్!

Priya Prakash Varrier opposite star heros son

  • స్టయిలిష్ గా కన్నుగీటడంతో స్టార్ ఇమేజ్  
  • తొలిచిత్రం పరాజయంతో తగ్గిన క్రేజ్
  • విక్రం తనయుడు ధృవ్ సరసన ఛాన్స్

ప్రియా ప్రకాశ్ వారియర్!
ఆమధ్య తను నటించిన తొలి సినిమా విడుదల కాకుండానే దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న మలయాళ భామ తను. 'ఒరు అడార్ లవ్' చిత్రంలో స్టయిలిష్ గా కన్నుగీటి కుర్రకారు మతులు పోగొట్టింది. కన్నుగీటడంలో ఆమె నేర్పరితనాన్ని చూసి, 'ఇంత అందంగా.. సెక్సీగా.. మత్తుగా కన్నుగీటచ్చా?' అన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. అయితే, ఆ సినిమా విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు వచ్చిన క్రేజ్ అంతగా పనికిరాలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.

ఈ క్రమంలో ఈ చిన్నది తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ప్రముఖ నటుడు విక్రం తనయుడు ధృవ్ హీరోగా నటించే చిత్రంలో కథానాయికగా నటిస్తూ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దీనికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అసిస్టెంట్ రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోపక్క, నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తెలుగు చిత్రంలో కూడా ప్రియా ప్రకాశ్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది.  

Priya Prakash Varrier
Oru Adaar Love
Vikram
Dhruv
  • Loading...

More Telugu News