Narendra Modi: ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు

 Prime Minister Narendra Modi pays last respects to former President PranabMukherjee

  • 10 రాజాజీ మార్గ్ నివాసంలో ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహం
  • నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని
  • సామాన్య ప్రజలకూ అనుమతి

అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 10 రాజాజీ మార్గ్ నివాసంలో ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడి ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. 11 నుంచి 12 గంటల మధ్య సామాన్య ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం ఉంటుంది.

కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తరలిస్తారు. గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్సులోనే శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

  • Loading...

More Telugu News