COVAXIN: శుభవార్త... 'కోవాగ్జిన్' సురక్షితం.. తొలి దశ ప్రయోగ ఫలితాలు విడుదల!

Good News on Virus Vaccine Covaxin

  • 'కోవాగ్జిన్' భారత్ బయోటెక్ ఆవిష్కరణ 
  • ప్రస్తుతం మూడు వ్యాక్సిన్ లకు ట్రయల్స్
  • ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న వైద్య బృందాలు

పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' పూర్తిగా సురక్షితమన్న శుభవార్త వెలువడింది. తొలి దశ ట్రయల్స్ ముగిశాయని, ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు.  

ప్రస్తుతం ఇండియాలో మూడు వ్యాక్సిన్ లకు ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తో పాటు ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందున్నాయి. ఈ రెండూ ప్రస్తుతం రెండు, మూడవ దశ ట్రయల్స్ లో నిమగ్నమై ఉన్నాయి. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధిస్తున్న వైద్య బృందాల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టులు వస్తున్నాయి.

ఈ ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీన్ని తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వారికి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఇదే విషయం వెల్లడైందని వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, నిన్న మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, డిసెంబర్ లోగా వ్యాక్సిన్ విడుదలవుతుందని, ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

COVAXIN
Trails
Vaccine
Corona Virus
  • Loading...

More Telugu News