Suneel: హాస్య నటుడు సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య'!

Sunil in and as Vedantam Raghavayya

  • గతంలో హీరోగా రాణించలేకపోయిన సునీల్ 
  • ఇటీవలి కాలంలో మళ్లీ హాస్య పాత్రల పోషణ
  • హరీశ్ శంకర్ కథతో 'వేదాంతం రాఘవయ్య'
  • 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మాణం 

సినిమా రంగంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్న విలన్లుగా నటించిన వాళ్లు నేడు హీరోలైపోతారు.. నేడు హీరోలుగా నటించే వాళ్లు రేపు విలన్ పాత్రలు వేసుకుంటారు. అందుకే, వచ్చే అవకాశాలను బట్టి చాలామంది సర్దుకుపోతుంటారు. హాస్యనటుడు సునీల్ పరిస్థితీ అంతే!

ఒకప్పుడు తను బిజీ కమెడియన్.. పలు చిత్రాలలో చక్కని హాస్యాన్ని పండించి హాస్యనటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రావడంతో కొన్ని సినిమాలు చేశాడు. అయితే, కథానాయకుడుగా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ ఈమధ్య హాస్య పాత్రలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో సునీల్ మళ్లీ ఇప్పుడు ఒక చిత్రంలో హీరోగా నటించనున్నాడు. ఆ చిత్రం పేరు 'వేదాంతం రాఘవయ్య'. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దీనికి కథను సమకూర్చడమే కాకుండా, ఈ చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామిగా చేరి, సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకునే ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. త్వరలోనే దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా హాస్యప్రధానంగానే సాగుతుందని వేరే చెప్పక్కర్లేదు కదూ!

  • Error fetching data: Network response was not ok

More Telugu News