Ambati Rambabu: చంద్రబాబును జనం ఎప్పుడో మర్చిపోయారు: అంబటి వ్యాఖ్యలు

Ambati Rambabu says AP people forgot Chandrababu
  • రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిందేమీలేదన్న అంబటి
  • ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తుంటారని విమర్శలు
  • జూమ్ బాబు, ట్విట్టర్ బాబు అంటూ చంద్రబాబు, లోకేశ్ లపై వ్యంగ్యం
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధినాయకత్వంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జనం ఎప్పుడో మర్చిపోయారని, అందుకే ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, ఏపీలో ప్రతిపక్షం ఉన్నట్టు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రజలకు ప్రతిపక్షం ఎప్పుడో దూరమైందని, హైదరాబాదుకే పరిమితమైన చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా రాజకీయాలు చేస్తూ జూమ్ బాబు అయ్యారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆరోపించారు. అటు, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పైనా అంబటి విమర్శలు చేశారు. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తూ ట్విట్టర్ బాబు అయ్యారని వ్యంగ్యం ప్రదర్శించారు.
Ambati Rambabu
Chandrababu
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News