China: భారత్ తో తాజా వివాదంపై స్పందించిన చైనా

China responds on latest situations at border

  • సరిహద్దుల్లో మరోసారి డ్రాగన్ దూకుడు
  • తిప్పికొట్టిన భారత సైన్యం
  • తాము గీత దాటలేదన్న చైనా
  • చర్చలు నడుస్తున్నాయన్న ఝావో లిజియాన్

ఎల్ఏసీ వెంబడి పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా బలగాలు యత్నించాయని, దాదాపు 200 మంది చైనా సైనికులు భారీ స్థాయిలో నిర్మాణ సామగ్రితో ముందుకు వచ్చారని భారత సైనికాధికారులు పేర్కొనడం తెలిసిందే. దీనిపై చైనా స్పందించింది. తమ సైన్యం ఎక్కడా అతిక్రమణలకు పాల్పడలేదని, ఎల్ఏసీని దాటలేని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. గాల్వన్ లోయ ఘర్షణల నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన చైనా... మళ్లీ నిర్మాణాల కోసం ప్రయత్నిస్తుండడంతో భారత సైన్యం అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News