Revanth Reddy: శ్రీశైలం ప్రమాదం ఘటనలో క్రిమినల్ కోణం ఉంది: మోదీకి రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy writes letter to Modi

  • వందల కోట్ల నష్టం వాటిల్లింది
  • సీబీఐతో విచారణ జరిపించాలి
  • ప్రభాకర్ రావు వల్ల ట్రాన్స్ కో, జెన్ కోలకు నష్టం జరుగుతోంది

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ రేంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ ఘటన వెనుక క్రిమినల్ కోణం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రమాదం వల్ల రూ. వందల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ఘటనపై సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణలో అసలైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. జెన్ కో, ట్రాన్స్ కోలకు అనుభవం లేని ప్రభాకర్ రావు ఎండీగా ఉండటం వల్ల ఆ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని కోరారు.

Revanth Reddy
Congress
Narendra Modi
BJP
Srisailam Power Plant
Letter
  • Loading...

More Telugu News