Amit Shah: ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్!

Amit Shah Descharged from AIIMS

  • కరోనాను జయించిన తరువాత అనారోగ్యం
  • ఈ నెల 18 నుంచి చికిత్స
  • ఈ ఉదయం ఇంటికి పంపించిన వైద్యులు

కరోనా వైరస్ ను జయించి, ఆపై అనారోగ్యం బారినపడిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఈ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన అమిత్ షాకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన నిపుణుల సూచనతో గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ చేరి, 12 రోజుల చికిత్స అనంతరం 14న ఇంటికి వెళ్లారు.

ఆపై ఆయన తీవ్రమైన అలసట, ఒళ్లునొప్పులు బారిన పడి, 18న ఎయిమ్స్ లో చేరారు. ఆసుపత్రిలోని అత్యుత్తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా పూర్తి అరోగ్యంగా ఉన్నారని, అందువల్ల డిశ్చార్జ్ చేశామని అధికారులు వెల్లడించారు.

Amit Shah
Corona Virus
AIIMS
Discharge
  • Loading...

More Telugu News