Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Tamanna opposite Vijay after Ten years

  • పదేళ్ల తర్వాత విజయ్ తో తమన్నా 
  • 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ లో కార్తీక్ ఆర్యన్
  • నాని సినిమా కోసం కోల్ కతా సెట్ 
  • మరో ప్రయోగం చేస్తున్న శర్వానంద్

*  తమిళ స్టార్ హీరో విజయ్ సరసన కథానాయిక తమన్నా పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు నటించనుంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'తుపాకి' సీక్వెల్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా తమన్నాను తీసుకున్నట్టు తెలుస్తోంది. 2010లో వచ్చిన 'సుర' చిత్రంలో వీరిద్దరూ కలసి నటించారు.
*  తెలుగులో హిట్టయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హిందీలో రీమేక్ చేయనున్నాడు. ఇందులో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుందట.
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం రూపొందుతోంది. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాదు గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోల్ కతా వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ వేస్తున్నారు.  
*  మన యంగ్ హీరోలలో శర్వానంద్ మంచి నవ్యత వున్న కథలు ఎంచుకుంటూ ఉంటాడు. అలాగే తాజాగా ఫిజికల్లీ చాలెంజ్డ్ యువకునిగా నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశ్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.  

Tamannaah
Vijay
Jahny
Nani
Sharwanand
  • Loading...

More Telugu News