Road Accident: రహదారి రక్తదాహం... చిత్తూరు జిల్లాలో నలుగురి మృతి

Four killed in road accident in Chittoor district
  • బంగారుపాళ్యెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • బైక్ ను ఢీకొట్టి, ఆపై లారీని గుద్దిన కారు
  • బైకర్ తో పాటు కారులో ఉన్న ముగ్గురు మృత్యువాత
చిత్తూరు జిల్లాలో రహదారి రక్తమోడింది. బంగారుపాళ్యెం పోలీసు స్టేషన్ పరిధిలో పాలమాకుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బాబు అనే వ్యక్తి బైక్ పై చిత్తూరు వెళుతూ రోడ్డు క్రాస్ చేస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దాంతో అతడి తల నుజ్జునుజ్జయిపోయింది.

అప్పటికే అదుపుతప్పిన ఆ కారు ఆ తర్వాత ఓ లారీని ఢీకొట్టింది. దాంతో, కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. కారులో మరణించినవారిని వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, రత్నంగా గుర్తించారు. వీరు బెంగళూరు వాసులు. కారులో ఉన్న శిరీష అనే యువతికి గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Road Accident
Death
Chittoor District
Police

More Telugu News