Donald Trump: అమెరికాలో ట్రంప్‌లా అటువంటి పనులను నేను చేయను: బైడెన్

biden slams trump

  • ఆర్మీని ట్రంప్‌ తన వ్యక్తిగత కక్ష్య సాధింపులకు వాడుతున్నారు
  • పౌరుల హక్కులను కాలరాస్తున్నారు
  • హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పౌరులను ఉసిగొల్పుతున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో ఆయన ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... తమ దేశ ఆర్మీని ట్రంప్‌ తన వ్యక్తిగత కక్ష్య సాధింపులకు వాడుకుంటున్నారని, పౌరుల హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు.

తాను అమెరికాకు  అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక సైన్యాన్ని ఆయనలా వినియోగించుకోబోనని బైడెన్ తెలిపారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ఇతర పౌరులను ట్రంప్‌ ఉసిగొల్పారంటూ ఆయన ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక వైట్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోవడానికి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ నిరాకరిస్తే సైన్యమే ఆయనను అక్కడి నుంచి పంపుతుందని చెప్పారు.

కాగా, 'మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' విధానం వల్ల తనకు ఓట్లు పడబోవని  ట్రంప్ భావిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో‌ మొదటి నుంచి ఈ విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఆయన ఓడిపోతే ఈ సాకుతో శ్వేతసౌధాన్ని‌ వీడకపోవచ్చునన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను అందులోంచి సైన్యం పంపుతుందని బైడెన్ అన్నారు.

  • Loading...

More Telugu News