Nutan Naidu: జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు.. అనారోగ్యం నాటకమాడిన నూతన్ నాయుడు భార్య

Nutan Naidu wife and 7 others arrested
  • శిరోముండనం కేసులో మధుప్రియ సహా ఏడుగురి అరెస్ట్ 
  • నూతన్ నాయుడు ప్రమేయం పైనా పోలీసుల ఆరా
  • పనిమానేసినందుకు శిరోముండనం చేయించిన మధుప్రియ
దళిత యువకుడికి శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు భార్య మధుప్రియ జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యం నాటకం ఆడారు. దీంతో పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు చెప్పడంతో ఆమె నాటకం బయటపడింది.

శిరోముండనం కేసులో మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండడంతో దాని నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం నాటకం ఆడారు. కాగా, ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ ఇంట్లో పనిమానేసిన కర్రి శ్రీకాంత్ అనే యువకుడిని మధుప్రియ ఇంటికి పిలిపించి శిరోముండనం చేయించడం రాష్ట్రంలో సంచలనమైంది.
Nutan Naidu
Madhupriya
tonsuring
Visakhapatnam District

More Telugu News