Sushant Singh Rajput: ప్రియురాలు రియా షాపింగ్‌ , మేకప్ కోసం రూ.లక్షలు ఖర్చు చేసిన హీరో సుశాంత్‌‌.. విచారణలో వెల్లడి

sushant spends lakhs for rhea shopping
  • ఆర్థిక లావాదేవీల వివరాల పరిశీలన
  • రియాతో పాటు ఆమె సోదరుడి కోసం రూ.9.5 లక్షల ఖర్చు
  • రియా షాపింగ్‌, మేకప్‌ ఖర్చులే రూ.3.4 లక్షలు
  • వ్యక్తిగత విలాసాల కోసం అధికంగా ఖర్చు చేసే సుశాంత్
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు రావడంతో ఈ విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా, సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతా‌ లావాదేవీలకు సంబంధించి పలు విషయాలు బయటపడ్డాయి.

సుశాంత్‌ తన బ్యాంక్‌ ఖాతాలోని డబ్బుని పలువురి కోసం ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. రియాతో పాటు ఆమె సోదరుడి కోసం కూడా ఆయన ఖర్చు పెట్టాడని చెప్పారు. వారిద్దరి కోసం మొత్తం రూ.9.5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వాటిల్లో వారి విమాన టిక్కెట్ల కోసం చేసిన ఖర్చు రూ.1.7 లక్షలుగా ఉందని, రూ.4.72 లక్షలు రియా సోదరుడి హోటల్‌ ఖర్చులకి ఇచ్చాడని వివరించారు.

రియా షాపింగ్‌, మేకప్‌తో పాటు ఇతర ఖర్చుల కోసం 3.4 లక్షలు వాడాడని చెప్పారు. కాగా, గత ఏడాదిలో జనవరి నుండి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్ల రుపాయలు ఖర్చు చేశాడని వివరించారు. ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.42 లక్షలు విడ్‌ డ్రా చేశాడని చెప్పారు.

ఫాంహౌస్‌ కోసం, వ్యక్తిగత విలాసాల కోసం కోటి రుపాయలకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. అయితే, సుశాంత్‌ నుంచి డబ్బు తీసుకుంటూ బతుకుతున్నానంటూ వస్తోన్న ఆరోపణలను రియా ఇప్పటికే ఖండించింది. నిన్న ఆమెను సీబీఐ అధికారులు ముంబైలో దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేశారు.
Sushant Singh Rajput
Bollywood
Crime News

More Telugu News