Omkar: 'రాజుగారి గది 4'కి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు!

Another sequel planned for Rajugari Gadi movie

  • తెలుగులో పెరిగిన సీక్వెల్స్ నిర్మాణం 
  • 'రాజుగారి గది'తో దర్శకుడిగా మారిన ఓంకార్ 
  • 'రాజుగారి గది 2'లో నటించిన నాగార్జున 

ఇటీవలి కాలంలో తెలుగులో సీక్వెల్స్ నిర్మాణం పెరుగుతోంది. ఒక సినిమా హిట్టయితే కనుక దానికి సీక్వెల్ ను ప్లాన్ చేసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ముగింపును కూడా రూపొందిస్తున్నారు. చిత్రకథను కొనసాగించే అవకాశం ఉండేలా సినిమా ముగింపును ఇస్తున్నారు. ఈ క్రమంలో 'రాజుగారి గది' సినిమాకు త్వరలో నాలుగో ఎడిషన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి, ఐదేళ్ల క్రితం 'రాజుగారి గది' పేరిట ఓ హారర్ థ్రిల్లర్ ను రూపొందించాడు. అది అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'రాజుగారి గది 2' చిత్రాన్ని నిర్మించారు. అందులో నాగార్జున కథానాయకుడుగా నటించడంతో దానికి మంచి క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత 'రాజుగారి గది 3'ని తెరకెక్కించారు. ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్ గా నటించారు. ఇది కూడా ఫరవాలేదనిపించింది. ఈ క్రమంలో 'రాజుగారి గది 4' చిత్ర నిర్మాణానికి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

Omkar
Nagarjuna
Avika Gor
Ashwin
  • Loading...

More Telugu News