Corona Virus: దేశంలో 62,550కి చేరిన కరోనా మృతుల సంఖ్య

 India records 76472 fresh cases in the last 24 hours

  • గత 24 గంటల్లో 76,472 మందికి కరోనా 
  • మొత్తం కేసులు 34,63,973
  • కోలుకున్న వారు 26,48,999 మంది
  • 7,52,424 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స  

దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కేవలం  గత 24 గంటల్లో 76,472 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,021 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 34,63,973కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 62,550కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  26,48,999 మంది కోలుకున్నారు. 7,52,424 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 76.47 శాతంగా ఉంది.

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,47,995కి చేరింది. ఆగస్టు 4 నుంచి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల శాతం 22గా ఉంది.

  • Loading...

More Telugu News