Melania Trump: ఇది నిజంగా కోపమేనా..? వైరల్ అవుతున్న మెలానియా ట్రంప్ వీడియో

Melania Trump video went viral in media
  • అధికారికంగా నామినేషన్ స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్
  • వేదికపైకి వచ్చిన కూతురు ఇవాంకా ట్రంప్
  • ఇవాంకా రాకతో మెలానియా ముఖంలో చిత్రమైన భావాలు!
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న వేళ ఆయన భార్య మెలానియా ట్రంప్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. భర్తతో పాటు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మెలానియా... సభ మధ్యలో ఇవాంకా ట్రంప్ వేదికపైకి రాగా ఆమెను చూసి మొదట నవ్వి, ఆపై పట్టరాని కోపం ప్రదర్శించినట్టు ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. అయితే, మెలానియా నిజంగానే కోపం ప్రదర్శించిందా? ఒకవేళ అదే నిజమైతే ఇవాంకా అంటే ఆమెకు ఎందుకంత కసి? అని నెటిజన్లకు సందేహాలు వస్తున్నాయి.

అయితే, మీడియాలో మాత్రం మెలానియా... ఇవాంకాను చూసి పట్టరాని ఆవేశంతో పళ్లు పటపట కొరికిందంటూ కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ వీడియో మాత్రం ఆసక్తిదాయకంగా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్న ట్రంప్ ఇవాళ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ చివరిరోజు సమావేశంలో ఈ ఘటన జరిగింది.

Melania Trump
Viral Videos
Donald Trump
Ivanka Trump
USA

More Telugu News