Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

Pranab Mukherjee is under intensive care and is being treated for lung infection and renal dysfunction

  • న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స  
  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స
  • వెంటిలేటర్‌పైనే ప్రణబ్
  • కోమాలోనే ఉన్నారని వెల్లడి

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందుతోన్న విషయం తెలిసిందే. ఆయనకు కరోనా సోకడంతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ చేయగా, అనంతరం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది.

ప్రణబ్‌ ముఖర్జీకి ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అలాగే, ఆయన కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు మెరుగుపడడం కోసం వైద్యం అందుతోందని చెప్పింది. ప్రణబ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది. ఆయన గుండెకు సంబంధించిన వ్యవస్థల పనితీరు స్థిరంగా ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News