Japan: అనారోగ్య సమస్యల నేపథ్యంలో రాజీనామాకు సిద్ధమైన జపాన్ ప్రధాని షింజో అబే

Japanese Prime Minister Shinzo Abe   is set to resign

  • త్వరలోనే అధికారికంగా ప్రకటన 
  • ఆరోగ్య సమస్యలతో అబే సతమతం
  • ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని నిర్ణయం

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. తన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా ప్రకటించింది.

కాగా, చాలా కాలంగా షింజో అబే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు టోక్యోలోని ఓ ఆసుపత్రి వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు వైద్య పరీక్షలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని పదవికి షింజో  అబే రాజీనామా చేశాక ప్రస్తుత ఉప ప్రధాని తారో అసో తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా అబే రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News