BiggBoss-4: సెప్టెంబరు 6న 'బిగ్ బాస్-4' ప్రారంభం

Bigg Boss fourth season starts on september sixth
  • లేటెస్ట్ ప్రోమో రిలీజ్
  • బిగ్ బాస్ నాలుగో సీజన్ కు ముహూర్తం ఖరారు
  • కంటెస్టెంట్ల జాబితాపై ఇంకా రాని స్పష్టత
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ నాలుగో సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రసవత్తరమైన కార్యక్రమం ప్రీమియర్స్ కు సంబంధించి లేటెస్ట్ ప్రోమో కొద్దిసేపటి కిందే సోషల్ మీడియాలో రిలీజైంది. సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్-4 సందడి షురూ అవుతుంది. ఎన్నడూ చూడని ఎంటర్టయిన్ మెంట్, నిజమైన భావోద్వేగాలు అంటూ హోస్ట్ నాగార్జున తాజా ప్రోమోలో పేర్కొన్నారు. కాగా, ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకైతే అరియానా గ్లోరీ, మహబూబ్ దిల్ సే పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

BiggBoss-4
September6
Nagarjuna
Season Four
Andhra Pradesh
Telangana

More Telugu News