Rahul Gandhi: వ్యాక్సిన్ విషయంలోనైనా కదలరా? కేంద్రం వైఖరి ప్రమాదకరమన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Targeted Modi Once More

  • ఇప్పటికే ప్రజలను ప్రమాదంలోకి నెట్టారు
  • కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదు
  • కేంద్రంపై మండిపడిన రాహుల్ గాంధీ

దేశ ప్రజలను, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిన కరోనా మహమ్మారికి, వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ వైరస్ ఇప్పటికే 33 లక్షల మందికి పైగా సోకిందని గుర్తు చేసిన ఆయన, అయినా కేంద్రం పారదర్శక వ్యూహంతో వెళ్లడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితి దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టవచ్చని రాహుల్ హెచ్చరించారు.

కాగా, ఈ నెల 14న తన ట్విట్టర్ ఖాతాలో, వ్యాక్సిన్ పై కేంద్రం వ్యూహం ఏంటో, ఎప్పుడు తెస్తారో తెలియజేయాలంటూ రాహుల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశ ప్రజలకు ఓ స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ లభిస్తే దాని ధర అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువగా ఉండాలని, పంపిణీ కూడా పారదర్శకంగా సాగాలని ఆయన అన్నారు.

ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ, నిత్యమూ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ విషయంలో రాహుల్ తనకు లభించే ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. కేసుల సంఖ్య 20 లక్షలు దాటగానే, తన ట్విట్టర్ టైమ్ లైన్ లోని పాత ట్వీట్ ను రీ పోస్ట్ చేసిన రాహుల్, తాను చెప్పినట్టే జరుగుతోందని వ్యాఖ్యానించారు. జూలై 17న కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను తాకిన వేళ, ఆగస్టు 10 నాటికి ఈ కేసులు 20 లక్షలు అవుతాయని రాహుల్ హెచ్చరించారు. ఆయన అంచనా వేసినట్టే జరిగింది.

  • Loading...

More Telugu News