Mohan Babu: భార్య నిర్మలతో కలిసి మోహన్ బాబు ఫొటో షూట్... వీడియో ఇదిగో!

Mohanbabu First Photo Shoot Video with Wife Nirmala

  • ఇటీవల విష్ణు కుమార్తె పుట్టిన రోజు
  • ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్న ఫ్యామిలీ
  • తొలిసారిగా ఫొటో షూట్ లో పాల్గొన్న దంపతులు

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, తొలిసారిగా తన భార్య నిర్మలతో కలిసి ఫొటో షూట్ లో పాల్గొనగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది. ఇటీవల విష్ణు చిన్న కుమార్తె విద్య తొలి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ఎవరినీ పిలవక పోయినా, ఇంట్లోనే అందరూ కలిసి గ్రాండ్ గా ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్యూటిఫుల్ మెమొరీస్ కోసం మోహన్ బాబు, నిర్మల దంపతులకు ఫొటో షూట్ చేయించారు.

మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా ఎవరో ఒకరు ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజా ఫొటో షూట్ వీడియోను 'బిహైండ్ ది సీన్' అంటూ మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఫొటో షూట్ చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో ఇద్దరూ చూడముచ్చటగా కనిపిస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News